: 1.65 కోట్లకు అమ్ముడుపోయిన రచయిత్రి చిత్తరువు
అభిమానం చూపించేందుకు అభిమానులు రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు. తాజాగా ఓ అభిమాని ఓ ప్రముఖ రచయిత్రిపై అత్యంత అభిమానాన్ని ప్రదర్శించాడు. వివరాల్లోకి వెళ్తే, ప్రైడ్ అండ్ ప్రిజుడీస్ రచయిత్రి జేన్ ఆస్టిన్ అరుదైన చిత్రాన్ని సౌత్ బే వేలం వేసింది. వేలం పాటలో ఈ చిత్రం రికార్డు స్థాయిలో 1.65 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. దీనిని ఓ అజ్ఞాత అభిమాని సొంతం చేసుకున్నాడు. ఈ పెయింటింగ్ ను జేన్ ఆస్టిన్ మేనల్లుడు జేమ్స్ ఆండ్రూస్ వాటర్ కలర్స్ తో 1869లో చిత్రీకరించాడు. జేన్ ఆస్టిన్ సోదరి కాసండ్రా రూపొందించిన చిత్రం ఆధారంగా జేమ్స్ ఈ చిత్రాన్ని గీశారు. కాగా కాసండ్రా గీసిన చిత్రం ప్రస్తుతం లండన్ లోని నేషనల్ పోట్రెయిట్ గ్యాలరీలో ఉంది.