: పూర్తయిన అక్బర్ వాయిస్ రికార్డ్... రిమాండు పొడిగింపు
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వాయిస్ రికార్డును నిర్మల్ పోలీసులు సంబంధిత నిపుణుల సమక్షంలో నిర్వహించారు. పరీక్షల అనంతరం అక్బర్ వాయిస్ శాంపిల్స్ ను తీసుకున్నారు. కాగా, నేటితో అక్బర్ రిమాండు గడువు పూర్తవడంతో, ఆదిలాబాద్ నిర్మల్ కోర్టు ఈ నెల 19 వరకు ఆయన రిమాండును పొడిగించింది. మరోవైపు కలెక్టరును దూషించిన కేసులో అక్బర్ బెయిల్ పిటిషన్ పై సంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అయితే, కోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచి, నిర్ణయాన్ని వాయిదా వేసింది.