: రైల్వే టీటీఈని కొట్టి చంపిన ప్రయాణికులు
ఇద్దరు ప్రయాణికులు రైల్వే టీటీఈని కొట్టి చంపిన ఘటన చెన్నై-షిరిడి ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి చెన్నై నుంచి షిరిడీ వెళుతున్న ఎక్స్ ప్రెస్ లోని ఏసీ కోచ్ లో నీళ్లు రావడం లేదని వంశీకృష్ణ, అమ్రేష్ బాబు అనే ఇద్దరు ప్రయాణికులు టీటీఈ సంజీవరావుపై తీవ్రంగా దాడి చేశారు. దాంతో, టీటీఈ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆగి ఉన్నప్పుడు జరిగింది. వెంటనే నిందితులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత చిన్న కారణంతోనే టీటీఈపై దాడి చేయడమేంటని ఆశ్చర్యం కలుగుతుంటే .. నిందితులు మాత్రం టీటీఈ తమను కోటి రూపాయిలు డిమాండ్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.