: అనారోగ్యం కారణంగా నేడు హజారేను కలవలేకపోతున్న కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఈ రోజు తాను సామాజిక కార్యకర్త అన్నా హాజారేను కలవలేకపోతున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ నెల 10 నుంచి మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో జనలోక్ పాల్ బిల్లు కోసం హజారే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు మద్దతు తెలిపేందుకు నేడు అక్కడకు వెళ్లాలని కేజ్రీవాల్ అనుకున్నారు. కానీ, గతరాత్రి జ్వరం రావడంతో తాను వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. అయితే, పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్, గోపాల్ రవి రాలేగావ్ వెళతారని.. వారక్కడికి వెళ్లాక ఫోన్ ద్వారా అన్నాతో మాట్లాడతానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.