: ఓ ఇంటివాడైన మాజీ క్రికెటర్ శ్రీశాంత్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ ఓ ఇంటివాడయ్యాడు. జైపూర్ రాజ కుటుంబానికి చెందిన భువనేశ్వరి కుమారిని నిన్న(బుధవారం) కేరళలోని గురువయూర్ శ్రీ కృష్ణుడి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ఇరువైపుల పెద్దలు, బంధువులు, స్నేహితులు హాజరైన ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీశాంత్, భువనేశ్వరి కొంతకాలం నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. అదే సమయంలో వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకారం తెలిపారు.