: 'మా సమైక్య తల్లికి, విభజన పూల దండ'.. పాట పాడిన శివప్రసాద్
రాష్ట్ర విభజనలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అవిశ్వాస తీర్మానంపై భయపడి కాంగ్రెస్ సభను వాయిదా వేస్తోందని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయకుండా, పార్లమెంటులో బిల్లు చేయడం కష్టమని తెలిపారు. మరో టీడీపీ ఎంపీ శివప్రసాద్ తో కలసి ఆయన పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శివప్రసాద్... 'మా సమైక్య తల్లికి, విభజన పూల దండ' అంటూ పాట పాడారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే, గుండె తరుక్కుపోతోందని అన్నారు. యూపీఏ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని తెలిపారు. ఈ రోజు శివప్రసాద్ నామాలు పెట్టుకుని, విచిత్ర వేషధారణతో పార్లమెంటుకు హాజరయ్యారు.