: డికాక్, డివిలీర్స్ సెంచరీలు.. సౌతాఫ్రికా స్కోర్ 252/5
సెంచూరియన్ క్రికెట్ క్లబ్ లో జరుగుతున్న చివరి వన్డేలో సౌతాఫ్రికా సంచలనం డికాక్ హ్యాట్రిక్ సెంచరీ బాదేశాడు. తిరుగులేని ఆటతీరుతో భారత్ పై వరుసగా మూడు వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన డికాక్ టీమిండియాను ఆడుకున్నాడు. అతనికి డివిలీర్స్ చక్కని సహకారమందించాడు. డికాక్ అవుటైన తరువాత డివిలీర్స్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ సాధించాడు. సెంచరీలు సాధించిన అనంతరం ఇద్దరూ పెవిలియన్ చేరినా.. సౌతాఫ్రికా భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. ఆదిలోనే మూడు వికెట్లు తీసిన టీమిండియా తరువాత అదే జోరు కొనసాగించలేకపోయింది. ఫీల్డింగ్ వైఫల్యాలను సొమ్ము చేసుకున్న డికాక్(101), డివిలీర్స్(109) సౌతాఫ్రికాను ఆదుకుని, భారీ స్కోరుకు బాటలు వేశారు. దీంతో సౌతాఫ్రికా 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ప్రస్తుతం మెక్ లారెన్(3), మిల్లర్(23) క్రీజులో ఉన్నారు.