: ప్రజలు సంయమనం పాటించాలి: సింగపూర్ ప్రధాని


ప్రశాంతంగా ఉండే సింగపూర్ దేశాన్ని ఇటీవల జరిగిన అల్లర్లు పట్టి కుదిపేశాయి. దీంతో సింగపూర్ పౌరులు సంయమనం పాటించాలని, ఉద్యోగం కోసం వలస వచ్చిన వారిపై అపోహలు పెంచుకోవద్దంటూ ప్రధాని లీ సేన్ లూంగ్ పిలుపునిచ్చారు. సింగపూర్ లో నివసించే విదేశీయుల్లో చాలా మంది చట్టానికి విధేయులేనని ఆయన అన్నారు. దేశ ప్రజల నుద్దేశించి ఇవాళ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా లీ సేన్ ఒక సందేశాన్ని విడుదల చేశారు. తమ భార్యా పిల్లలను పోషించుకోవడం కోసం వారు ఇక్కడకు వచ్చి కష్టపడి పనిచేస్తున్నారని, సింగపూర్ దేశ ఆర్థిక వ్యవస్థకు వారి తోడ్పాటు ఎంతో ఉందని అన్నారు. అలాంటి వారిపై అపోహలు పెంచుకోవద్దని, దురభిప్రాయం ఏర్పరుచుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ వలస కార్మికుడు మరణించడంతో సింగపూర్ లో హింస చెలరేగిన విషయం విదితమే. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు.. వారిలో పోలీసులు కూడా ఉన్నారు. సింగపూర్ అల్లర్లకు కారణమయ్యారంటూ ఇప్పటివరకూ 27 మంది ప్రవాస భారతీయులను అరెస్ట్ చేశారు. అల్లర్ల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News