: యూకే హైకమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మథాయ్
యూకేలో భారత హైకమిషనర్ గా రంజన్ మథాయ్ (61) బాధ్యతలు స్వీకరించారు. గతంలో 2005 నుంచి 2007 వరకు రంజన్ యూకే డిప్యూటీ హైకమిషనర్ గా పనిచేశారు. బ్రిటన్లో భారత హైకమిషనర్ గా ఉన్న జైమిని భగవతి పదవీ విరమణ పొందడంతో, ఆయన స్థానంలో రంజన్ మథాయ్ నియమితులయ్యారు. గత జులై వరకు మథాయ్ భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.