: స్వలింగ సంపర్కాన్ని యోగాతో తగ్గించవచ్చు: బాబా రాందేవ్


స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు ఇచ్చిన తీర్పును యోగా గురువు బాబా రాందేవ్ సమర్ధించారు. స్వలింగ సంపర్కాన్ని యోగా నయం చేస్తుందని తాను గ్యారెంటీ ఇస్తున్నానన్నారు. స్వలింగ సంపర్కం జన్యువు కాదన్న రాందేవ్.. మన తల్లిదండ్రులు స్వలింగ సంపర్కులైతే మనం పుట్టేవారం కాదన్నారు. కాబట్టి, అది అసహజమైనదని వివరించారు. కేవలం అదొక చెడు వ్యసనమేనని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు. లక్షలాది మంది భారతీయుల మనోభావాలను గౌరవించిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ఓ నేరంగా ప్రకటించిందన్నారు.

  • Loading...

More Telugu News