: చెల్లి బాగు కోసం బావను మట్టుపెట్టాడు..ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టాడు


బావ బాగుండాలని కోరుకోవడం సహజం. కానీ ఇక్కడ, చెల్లి కోసం కిరాయి హంతకులతో కలసి బావనే చంపించాడు. ఆ పైన హత్యకు సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేశాడో ప్రబుద్ధుడు. భాగ్యనగరంలో జరిగిన ఈ హత్యోదంతం సంచలనం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్... బల్కంపేటలో మూడు రోజుల క్రితం కిడ్నాప్ కు గురై, చివరకు శవమై కనిపించాడు. హంతకులు శేఖర్ ను చంపి రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలో రోడ్డుపై పడేశారు. నిందితుడు హత్యకు సంబంధించిన ఫోటోలను తన చెల్లికి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో హత్యోదంతం వెలుగుచూసింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేయించి హత్య చేయించింది బావమరిది అనిల్ అని తేలింది. కిరాయి హంతకుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News