: అసెంబ్లీ ఆవరణలో ప్రారంభమైన బీఏసీ సమావేశం
అసెంబ్లీ ఆవరణలో సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి.. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, చీఫ్ విప్ గండ్ర, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల అజెండాపై వీరు చర్చిస్తున్నారు.