: దిగ్విజయ్ సింగ్ ను అడ్డుకుంటాం: అశోక్ బాబు


సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగులు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సొంత పార్టీపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన సీమాంధ్ర ఎంపీలను అభినందిస్తున్నామని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యాక తమ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. డిగ్గీ రాజాకు ఆంధ్రలో పర్యటించే అర్హత లేదని.. ఆయనను అడ్డుకుని తీరతామని అశోక్ బాబు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News