: టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షాల భేటీ ప్రారంభం
టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు నేతృత్వంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. వీరు కూడా అసెంబ్లీ సమావేశాల వ్యూహంపైన చర్చిస్తున్నారు.