: ఏనుగులను పొట్టనపెట్టుకుంటున్న రైలు మార్గాలపై సుప్రీం కన్నెర్ర


ఏటా పదుల సంఖ్యలో ఏనుగులు రైళ్ల కిందపడి ప్రాణాలు కోల్పోతుండడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం.. స్పందన తెలియజేయాలని ఒడిశా, అసోం, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. అడవుల్లోని రైలు మార్గాల్లో రైళ్లు తక్కువ వేగంతో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. అలాగే, అడవుల్లో రైలు మార్గాలు లేకుండా వాటిని రూట్ మార్చే విషయమై రైల్వే అధికారులు కోర్టుకు హాజరై సూచనలు ఇవ్వాలని కోరింది.

  • Loading...

More Telugu News