: రాష్ట్రం విడిపోతుంటే.. నెంబర్ ప్లేట్ల మార్పిడి ఇప్పుడెందుకు: హరీష్ రావు
ఒకవైపు రాష్ట్ర విభజన జరుగుతుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పేరుతో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల మార్పడిని ప్రారంభించడంలో అర్థం ఏంటని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల మీద ప్రేమతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని... రాష్ట్రం విడిపోతే ఇప్పుడు ఏపీ పేరుతో తీసుకున్న నెంబర్ ప్లేట్లను తర్వాత టీ పేరుతో మరోసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. దీని వల్ల రెండు రకాలుగా ప్రజలు నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. తక్షణం ఈ నంబర్ ప్లేట్ల ప్రక్రియను నిలిపివేయాలని మంత్రి బొత్సను ఆయన డిమాండ్ చేశారు.