: అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతారనే వాయిదా వేశారు: కొనకళ్ల
అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందనే భయంతోనే పార్లమెంటులోని ఉభయసభల్లో కాంగ్రెస్ పార్టీ గందరగోళం సృష్టించి సభలను వాయిదా వేసిందని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గతంలో సభల్లో తీవ్ర గందరగోళం సృష్టించారంటూ పలువురు ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్, ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేదంటూ ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉందని కేవలం అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకు స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.