: ఆసీస్ జనరల్ మోటార్స్ లో ఉపాధి కోల్పోతున్న 2,900 మంది కార్మికులు
ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్(జీఎం) ఆస్ట్రేలియాలో రానున్న నాలుగేళ్ల పాటు ఉత్పత్తిని నిలిపివేయనుంది. ఈ మేరకు జీఎం ఛైర్మన్ దాన్ అకర్సన్ కాన్ బెర్రాలో ఓ ప్రకటన విడుదల చేశారు. జనరల్ మోటార్స్ 2017 వరకు కార్లు, ఇంజిన్ల ఉత్పత్తి నిలిపివేయనుందని తెలిపింది. దీని కారణంగా ఈ సంస్థలో ఉత్పత్తి విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న 2,900 మంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారని సమాచారం. కాగా 2017 తరువాత వీరినే కొనసాగనిస్తారా? లేక కొత్త కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా? అనే దానిపై కంపెనీ స్పష్టతనీయలేదు.