: తీర్పుపై అప్పీల్ చేస్తాం: గే హక్కుల సంస్థల న్యాయవాదులు
స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో హక్కుల ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారు. గే హక్కుల సంస్థల తరఫున వాదనలు వినిపించిన లాయర్లు.. గే కమ్యూనిటీకి ఈ రోజు చీకటి దినంగా అభివర్ణించారు. సుప్రీం తీర్పు తీవ్ర నిరాశపరిచిందని.. దీనిపై మళ్లీ పోరాటం చేస్తామని లాయర్ అరవింద్ నారాయణ్ చెప్పారు. ఇది చాలా విచారకరమైన తీర్పు అని మరో లాయర్ కొల్లిన్ గోన్ సాల్వ్ అన్నారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడం విచారకరమని నాజ్ ఫౌండేషన్ లాయర్ త్రిపాఠి చెప్పారు.