: భయపడే సభను వాయిదా వేశారు: ఎంపీ సబ్బం హరి
అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉండటంతో... కాంగ్రెస్ పార్టీ భయపడి సభను నడపకుండా వాయిదా వేసిందని సీమాంధ్ర ఎంపీ సబ్బం హరి విమర్శించారు. లోక సభ రేపటికి వాయిదా పడిన అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ భయపడుతోందని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కొన్ని పక్షాలతో కలసి సభలో గందరగోళ వాతావరణం సృష్టిస్తోందని విమర్శించారు. చర్చ కూడా లేకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను కాపాడటానికే తాము అవిశ్వాసానికి మొగ్గుచూపామని చెప్పారు.