: సోనియా ఇంటిముందు ధర్నా చేసే దమ్ము వైఎస్సార్సీపీకి ఉందా?: నారా లోకేష్


వైఎస్సార్సీపీపై టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీకి సోనియా ఇంటిముందు ధర్నా చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పై పోరాడుతోంది టీడీపీనే కాబట్టే, సోనియా ఇంటిముందు ధర్నా చేసిందని చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఎవరితో కుమ్మక్కైందో ప్రజలకు తెలుసన్న లోకేష్.. కాంగ్రెస్ కు కొమ్ముకాస్తోంది వైఎస్సార్సీపీయేనన్నారు. కాంగ్రెస్ కు దొంగపుత్రుడు, దత్తపుత్రుడు జగనేనన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కవని, అవినీతిపరులను తరిమి తరిమి కొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News