: ఆ పార్టీల చీకటి ఒప్పందం రుజువైంది: పయ్యావుల


కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి చీకటి ఒప్పదం ఖారారైందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ విషయం విజయలక్ష్మి మాటలతో తేలిపోయిందని చెప్పారు. ఓ ఆంగ్ల పత్రికకు విజయలక్ష్మి ఇంటర్వ్యూ ఇస్తూ 2014 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు మద్దతిస్తామని చెప్పారని పయ్యావుల వెల్లడించారు.

వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసమే కాంగ్రెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ వాడుకుందన్నారు. అదే విధంగా ఇప్పడు వైఎస్సార్ కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకుందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. 

  • Loading...

More Telugu News