పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా పడ్డాయి. లోక్ సభ, రాజ్య సభల్లో సీమాంధ్ర ఎంపీలు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఇరు సభల్లో గందరగోళ వాతావరణం నెలకొనడంతో, సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.