: ఏం చేద్దాం? ఎలా చేద్దాం?.. నేడు టీఆర్ఎస్, టీజేఏసీల కీలక భేటీలు


నేడో, రేపో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో, టీఆర్ఎస్, టీజేఏసీలు అప్రమత్తమయ్యాయి. దీనికి తోడు, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, సభలో ఎలాంటి వ్యూహాలు అమలుపరచాలనే విషయంపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో, ఇటు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం, అటు టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నేడు జరగనున్నాయి. టీబిల్లు శాసనసభకు వస్తే ఏం చేయాలి? రాకపోతే ఏం చేయాలి? అనే కోణంలో టీఆర్ఎస్ చర్చించి వ్యూహాలను ఖరారు చేయనుంది. అంతేకాకుండా, తెలంగాణ ఏర్పాటు విషయంలో కలిసి వచ్చే ఇతర పార్టీలతో ఏ విధంగా సమన్వయం కుదుర్చుకోవాలనే విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు, ఢిల్లీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను జేఏసీ సమీక్షించనుంది. అలాగే, ముసాయిదా బిల్లును సమీక్షించి, దానికి అవసరమైన సవరణలపై ఓ నిర్ణయానికి రానుంది.

  • Loading...

More Telugu News