: చందమామను పలకరించనున్న మగువ!


మగువలు ఏదైనా సరే సాధిస్తారు. ఈ విషయాన్ని అన్ని రంగాల్లోనూ రుజువు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. అత్యున్నత శిఖరాలను అధిరోహించడంలోనైనా, ఆకాశంలోనైనా కాలుపెట్టడంలో తాము కూడా పురుషులకు ఏమాత్రం తీసిపోమని ఎప్పటికప్పుడు వారు నిరూపించుకుంటూనేవున్నారు. ఇప్పుడు చంద్రుడిపైన కాలు పెట్టడానికి కూడా మగువలు సిద్ధపడుతున్నారు. చంద్రుడిపై కాలుపెట్టడం విషయానికొస్తే ఇప్పటి వరకూ 12 మంది మగవారు చంద్రుడిపైన తమ పాదం మోపారు. అక్కడికి వెళ్లడం అనేది మహిళలకు ఒక కలగా ఇంతకాలం ఉండేది. కానీ ఆ కలను సాకారం చేసుకునే అవకాశం మగువలకు రానుంది. త్వరలోనే చంద్రుడిపైకి ఒక మగువ కూడా వెళ్లే అవకాశాలున్నాయని బ్రిటన్‌ శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖామంత్రి డేవిడ్‌ విల్లెట్స్‌ చెబుతున్నారు.

అమెరికా, ఐరోపా, చైనా దేశాలు పరస్పరం చేతులు కలిపి మగువను చంద్రుడిపైకి పంపే కలను సాకారం చేయనున్నట్టు విల్లెట్స్‌ చెబుతున్నారు. ఈ దిశగా బ్రిటన్‌ చొరవ తీసుకుంటుందని, ఈ దేశాలు సంయుక్తంగా చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు. అంతరిక్ష యాత్రలో తర్వాత అడుగును వేయడంలో అమెరికా, ఐరోపా, చైనా దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తాము కృషి చేస్తామని విల్లెట్స్‌ చెబుతున్నారు. ఇప్పటి వరకూ చంద్రుడిపైన కాలుపెట్టిన 12 మంది వ్యోమగాములు అమెరికాకు చెందినవారేనని, 41 సంవత్సరాలక్రితం చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

భవిష్యత్తులో చంద్రుడిమీదకు మొదటి మనిషిని పంపేది కూడా చైనాయేనని విల్లెట్స్‌ చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ నియంత్రిత ల్యాండింగ్‌ కోసం ఆ దేశం ఒక ల్యాండర్‌ను కూడా పంపివుందని విల్లెట్స్‌ గుర్తుచేశారు. తర్వాత దశలో చైనా వ్యోమగాములు నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చే రోబోటిక్‌ యాత్రను చేస్తారు. తర్వాత వ్యోమగామిని పంపుతారు, తర్వాత మహిళను కూడా పంపే అవకాశం ఉంది, ఆ తర్వాత చైనా వ్యోమగాములు అంగారకుడిపైకి కూడా వెళతారు అంటూ విల్లెట్స్‌ చైనా గురించి చెప్పుకొచ్చారు. చంద్రుడిపై చైనా వ్యోమగాములు 2025 నుండి 2030 మధ్య దిగే అవకాశం ఉందని, ఇది చాలా దీర్ఘకాలిక ప్రణాళిక అనీ, ఈ విషయంలో చైనాకి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని విల్లెట్స్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News