: ఉత్తరాఖండ్ రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి


ఉత్తరాఖండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫితోడ్ గఢ్ జిల్లా లోని మున్సాయరి వద్ద జీపులో మేళాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జీపు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో 13 మంది చనిపోయారు, మరో ఎనిమిది మంది క్షతగాత్రులయ్యారు. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News