: 'సేవ్ అవర్ ఏపీ' మొబైల్ అప్లికేషన్ విడుదల
వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ 'సేవ్ అవర్ ఏపీ' పేరిట కొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపొందించింది. ఈ అప్లికేషన్ ను వైఎస్సార్ సీపీ నేత శోభానాగిరెడ్డి విడుదల చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం పేర్కొంది. ఈ అప్లికేషన్ పొందాలంటే గూగుల్ ప్లేస్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం తెలిపింది.