: దిగ్విజయ్ రాక రాష్ట్రానికి అపశకునం: అశోక్ బాబు


ఈ నెల 12న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వస్తుండటంపై ఏపీఎన్జీవోలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లును గెలిపించుకునేందుకే దిగ్విజయ్ ఇక్కడకు వస్తున్నారన్న సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు.. దిగ్విజయ్ రాక రాష్ట్రానికి అపశకునమన్నారు. దిగ్విజయ్ గో బ్యాక్ అంటూ ఎల్లుండి నుంచి నిరసనలు చేపడతామని చెప్పారు. ఏపీఎన్జీవోల హోమ్ లో మీడియాతో అశోక్ బాబు మాట్లాడారు.

సొంత పార్టీ సభ్యులే అవిశ్వాస తీర్మానం పెట్టారంటే సమైక్యవాదం తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోందన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాజీనామా చేయని ఎంపీలను సాంఘిక బహిష్కరణ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. విభజనపై అవగాహన లేని చిరంజీవి లాంటి వాళ్లు మన నేతలుగా ఉండటం దురదృష్టకరమన్నారు. కాగా, రాజకీయ నేతలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం నిన్నటి ఆందోళనల్లో తెలిసిందని, రాష్ట్రంలో 80 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. విభజన వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేకుండా పోతుందన్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నంతకాలం తమ ఆందోళనలు జరుగుతాయన్నారు.

  • Loading...

More Telugu News