: అభిమానుల మధ్య సందడి చేసిన ప్రభుదేవా-షాహిద్ కపూర్
డాన్స్ మాస్టర్, బాలీవుడ్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో షాహిద్ కపూర్ నటించిన చిత్రం ‘రాంబో రాజ్ కుమార్’ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు 10 కోట్లు , రెండవ రోజు 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సందర్భంగా ప్రభుదేవా-షాహిద్ కపూర్ లు ముంబై థియేటర్లలో అభిమానుల మధ్య ఆడి పాడి ఉత్సాహాన్ని నింపారు. బాలీవుడ్ లోని వినూత్న నృత్యాలకు దక్షిణాది వారు స్పూర్తిగా నిలిచారని ప్రభుదేవా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి డ్యాన్స్ లకు కొదవ ఉండదని ఆయన అన్నారు.