: బీజేపీకి మద్దతిచ్చే ప్రశ్నే లేదు: కేజ్రీవాల్
బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రశ్నే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తెలిపారు. జన్ లోక్ పాల్ బిల్లుకు బీజేపీ గనుక పార్లమెంటులో మద్దతిస్తే.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ చెప్పడం ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రశాంత్ భూషన్ కూడా తన మాటలను సవరించారు. బీజేపీ కూడా ఆమ్ ఆద్మీలా మారిపోతే.. అప్పుడు మద్దతిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తాననే తాను చెప్పానన్నారు.