: ఐదు రాష్ట్రాల ఫలితాలు యూపీఏ పని తీరును ప్రతిబింబిస్తున్నాయి: లగడపాటి


మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు యూపీఏ పని తీరును ప్రతిబింబిస్తున్నాయని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఢిల్లీలో పార్లమెంటు వద్ద ఆయన మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగిపోయే ఫలితాలు వచ్చాయని అన్నారు. ఎన్నికల్లో కనీస అంచనాలను కూడా కాంగ్రెస్ పార్టీ అందుకోలేక పోయిందని సొంత పార్టీ పైనే ధ్వజమెత్తారు.

అవిశ్వాసంపై సంఖ్యా బలం సంగతి ప్రక్కన పెడితే, ప్రభుత్వంపై సభకు విశ్వాసం ఉందో? లేదో? పరీక్షిస్తున్నామన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్న సంగతి తాజా ఎన్నికల ఫలితాలతోనూ, సీమాంధ్ర ప్రజల అసంతృప్తితోనూ తేలిపోయిందన్నారు. కేంద్రంలో ప్రభుత్వం దిగిపోయేందుకు ఇదే సరైన సమయమని లగడపాటి తెలిపారు.

  • Loading...

More Telugu News