: సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం పెట్టడం బాధాకరం: దిగ్విజయ్ సింగ్
యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదయోగ్యం కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానానికి పూనుకోవడం బాధాకరమని చెప్పారు. సీమాంధ్ర ఎంపీలతో మాట్లాడానని, వారు అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. లోక్ సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఉద్దేశించి సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని డిగ్గీ రాజా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ అత్యంత విశ్వాసపాత్రుడని, ఆయన పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తారని అనుకోవడం లేదని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఉండదని అన్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీదే తుది నిర్ణయమని చెప్పారు. ఈ నెల 12న హైదరాబాద్ వెళతామని తెలిపారు.