: రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి కార్లపైనే ఇక ఎర్ర లైట్లు
ఎవరు పడితే వాళ్లు.. ఆఖరికి ఎమ్మార్వోలు, పోలీసు జీపులపైనే ఎర్రలైట్లు కుయ్ కుయ్ మంటూ కూతలు వేస్తుంటాయి. ఇకపై ఎర్రలైటు ఎవరుపడితే వారు వాడడానికి ఎంతమాత్రం కుదరదు. కేవలం రాజ్యాంగ పదవుల్లో, ఉన్నత స్థాయిలో ఉన్నవారు మాత్రమే వీటిని ఉపయోగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతరులెవరూ వీటిని వాడకుండా నిషేధించింది. దీనికి సంబంధించి మోటారు వాహనాల చట్టంలో సవరణ చేయాలని ఆదేశించింది. అలాగే ప్రెషర్ హారన్లు(బూర లాంటి హారన్లు), భిన్న రకాల శబ్ధాలను ఇచ్చే హారన్లు, సంగీతంతో కూడిన హారన్లపై కూడా కోర్టు నిషేధం విధించింది. నెలలో ఈ ఆదేశాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.