: సర్.. ట్రాఫిక్ జామ్


కింద మీదా పడుతూ కంగారుగా.. ఆందోళనగా ఆఫీసుకు చేరుకున్నాం. బాస్ గుర్రుగా చూస్తున్నాడు ఈ రోజు కూడా లేటేనా? అన్నట్లుగా. అది గ్రహించి 'సారీ సర్ ట్రాఫిక్ జామ్' అని టక్కున అనేస్తాం. ముక్కుమీద కోపమున్న బాస్ అయితే నాలుగు చివాట్లు పెట్టి వదిలేస్తాడు. శాంతమూర్తి అయితే 'సరే నీ ఖర్మ' అన్నట్లు వదిలేస్తాడు. అదేమో కానీ, నిజంగా ట్రాఫిక్ జామ్ అయినా కాకపోయినా ఉద్యోగులకు అదొక లాభకరమైన అబద్దం. బాస్ దగ్గర రక్షణ కవచం!

నిజమే, ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చినప్పుడు వినిపించే కహానీ ట్రాఫిక్ జామేనట. నింబజ్ ఉద్యోగ ఉత్పత్తి సూచీ-2013 సర్వే చేసి మరీ ఈ విషయాన్ని చెప్పింది. అలస్యంగా వచ్చినా 8 గంటలకు పైనే పనిచేస్తూ ఉత్పాదకత తగ్గకుండా ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని ఈ సూచీ తెలిపింది. ఈ సర్వేలో మిగిలిన విషయాలకు వస్తే 30 శాతం మందే ఉద్యోగాల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News