: మంత్రి గారి ఆగడాలపై స్థానికుల ఆందోళన
కర్నూలు నగరంలో మంత్రి టీజీ వెంకటేశ్, ఆయన అనుచరులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని గౌరిపాల్ ఆసుపత్రి దగ్గరలో ఉన్న వక్ఫ్ బోర్డు స్థలంలో నివాసం ఉంటున్న స్థానికులను ఖాళీ చేయాలని కొన్నిరోజుల నుంచి అనుచరులు హెచ్చరిస్తున్నారు.
దీనికి వ్యతిరేకంగా స్థానికులు ఈరోజు ఆందోళనకు దిగారు. ఎప్పుడో ఇళ్లు కట్టుకొని, 70 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్న తమను అర్ధాంతరంగా వెళ్లి పొమ్మంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఖాళీ చేయాలని అడిగితే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.