: తెలంగాణ మినహా ఏ అంశంపైనైనా అవిశ్వాస తీర్మానానికి సిద్ధం: బీజేపీ
తెలంగాణ మినహా ఏ అంశంపైనైనా అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఢిల్లీలో ఈ ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక, 2జీ కేసులో జేపీసీ నివేదికపై, లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. దీనిపై పార్లమెంటులో చర్చకు డిమాండ్ చేయనుంది.