: తప్పు పార్టీది కాదు.. అధిష్ఠానానిది: లగడపాటి
రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనే నిర్ణయం తీసుకుని చరిత్రాత్మక తప్పిదం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని, కాంగ్రెస్ అధిష్ఠానమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఓ వార్తా చానల్ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న లగడపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్టేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు. దేశ రాజకీయాలలో కీలకమైన మార్పులు సంభవించిన నేపథ్యంలో, రాష్ట్ర విభజన అంత ఈజీగా జరగదని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు.