: యూపీఏ ప్రభుత్వం నడవటానికి ఏపీ ఎంపీలే కారణం: టీడీపీ ఎంపీలు
యూపీఏ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం నడవటానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలే కారణమన్నారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండేందుకు హక్కులేదని వ్యాఖ్యానించారు. యూపీఏ అనేక కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. సొంతపార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానమిచ్చారని.. అన్ని రంగాల్లో విఫలమైన యూపీఏను గద్దె దించేందుకే తీర్మానం ఇచ్చారన్నారు. యూపీఏపై స్పీకర్ కార్యాలయానికి అవిశ్వాస తీర్మానం నోట్ పంపిన అనంతరం ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో సీమాంధ్ర టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాజ్యంగ స్పూర్తిని మరచి ఆర్టికల్ 3ను ఉపయోగిస్తామనడం సరికాదన్నారు. దేశానికి సోనియా చెప్పినట్లు విని తలాడించే ప్రధాని ఉండటం దేశ ప్రజల దురదృష్టమన్నారు.