: విజయవాడ, విశాఖలో విభజనకు వ్యతిరేకంగా భారీ మానవ హారాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై నిరసనల సెగ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం విజయవాడలో ఇంద్రకీలాద్రి చుట్టూ జేఏసీ, పౌర సంఘాల కార్యకర్తలు కలిసి భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులు, సమైక్యవాదులు చేరారు. సమైక్యాంధ్ర సాధనే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఇక, విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్ లో సమైక్యవాదులు మానవ హారంగా ఏర్పడి నినదించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేవరకు ఆందోళనలను ఆపేది లేదని వారు స్పష్టం చేశారు.