: ఉగ్రవాది కాదు... దొంగే... నిర్ధారించిన పోలీసులు!


హైదరాబాదులో జంట పేలుళ్ల అనంతరం రాష్ట్రంలో ఎక్కడ ఏ వ్యక్తి అనుమానంగా తిరుగుతున్నా పోలీసులు నిఘా కళ్లతో పరిశీలిస్తున్నారు. అటువంటి వారిని అదుపులోకి తీసుకుని ఉగ్రవాదో, దొంగో, హంతకుడో విచారణ చేసి గానీ వదిలిపెట్టడం లేదు.

ఈ నేపథ్యంలోనే రెండురోజుల కిందట విశాఖ చేపలుప్పాడు ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిని మత్స్యకారులు భీమిలి పోలీసులకు అప్పగించారు. ఈ ఉదయం అతడిని విచారించిన అనంతరం ఉగ్రవాది కాదని పొలీసులు నిర్ధారించారు. అయితే, అతడు పలు చోట్ల వాహనాలు దొంగిలించే సయ్యద్ అజాద్ గా పోలీసులు తేల్చారు. అనంతరం అతడిని గాజువాక పోలీసులకు అప్పగించారు.   

  • Loading...

More Telugu News