: సహారా చీఫ్ సుబ్రతో రాయ్ కు కోర్టు ధిక్కార నోటీసులు
సహారా చీఫ్ సుబ్రతో రాయ్ కు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఇదే నోటీసును మరో ఇద్దరికి జారీ చేసిన కోర్టు.. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2జీ స్కాం విచారణలో జోక్యం చేసుకున్నందుకు నేర ధిక్కారం కింద రాయ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఈడీ అధికారి రాజేశ్వర్ సింగ్ వేసిన దరఖాస్తును పరిశీలించిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.