: ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం?: ఆలోచనలో పడిన కాంగ్రెస్


నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ ఆలోచనలో పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్నా ప్రజలకు ఎందుకు చేరువ కాలేకపోయామని ఆత్మ పరిశీలన దిశగా అడుగులు వేస్తోంది. ఘోర పరాజయంతో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజున కూడా ప్రశాంతంగా ఉండలేకపోతోంది. దీంతో ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కూడా హాజరుకానున్నారు. భేటీకి సంబంధించి ఇప్పటికే ముఖ్య నేతలకు ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందించారని తెలిసింది.

  • Loading...

More Telugu News