: సోనియాగాంధీకి మోడీ శుభాకాంక్షలు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీకి శుభాభినందనలు. ఆమె చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా' అంటూ తెల్లవారుజామునే ట్విట్టర్లో పోస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యపరిచారు. అలాగే, పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్ఎస్ఎస్ నేత జితేన్ తదితరులు కూడా సోనియాకు శుభాకాంక్షలు తెలిపారు.