: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై జోక్యం చేసుకోం: హైకోర్టు
వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వ్యవహారం సుప్రీంకోర్టు ముందు విచారణలో ఉన్నందున ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కాంట్రాక్టును ఒక్కరికే కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ఇవాళ విచారించింది.