: సూర్య కిరణాలతో కొన్ని రోజుల్లోనే చర్మానికి వార్ధక్యం


మన చర్మానికి ముందుగానే వార్ధక్యాన్ని తెచ్చేపెట్టే శక్తి సూర్యరశ్మికి వుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకులు.. కొన్ని రకాల అల్ట్రా వయొలెట్‌ కిరణాలు.. చర్మంపై ఉండే కణాలను కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే పూర్తిగా దెబ్బతీసేయగలవని చాటిచెబుతున్నారు. ఇలాంటి ఇబ్బంది ఉండేవారు సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సలహా ఇస్తున్నారు.

జామా డెర్మటాలజీ మేగజైన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం వివరాలు ఇలా ఉన్నాయి. అల్ట్రావయోలెట్‌ ఏ1 కిరణాలు చర్మం ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో అందులో పేర్కొన్నారు. ఈ యూవీఏ1 కిరణాలు చర్మం ముసలిదిగా మారిపోవడానికి కారణం అవుతాయంటూ తేల్చారు. ముడుతలు పడేలా, ఇతర సమస్యలు వచ్చేలా చేస్తాయంటున్నారు. పరిశోధనలకు నేతృత్వం వహించిన ఫ్రాంక్‌ వాంగ్‌ ప్రకారం.. ఇలాంటి కిరణాల ప్రభావాన్ని తెలియజేయడంలో తమ అధ్యయనమే మొదటిదని అంటున్నారు.

  • Loading...

More Telugu News