: అందమైన గోర్లను కలిగిఉండాలంటే...
మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం అంటే.. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన గోర్లను కలిగి ఉండడం కూడా ఒక కనీస అవసరం. అందుకు కొన్ని చిట్కాలు చెబుతున్నారు వైద్యులు. గోర్లను శుభ్రపరచడానికి ఆలివ్ ఆయిల్, మిల్క్ క్రీం, అసిటోన్ ఫ్రీ నెయిల్ పాలిష్‌లను ఉపయోగిస్తే గోర్లు శుభ్రంగా ఉంటాయి. దీనికి సంబంధించి సౌందర్య పరిరక్షణ శిక్షకురాలు.. ఎస్.ప్రీతి కొన్ని సూచనలు చేస్తున్నారు. ఒక చిన్న పాత్రలో ఆలివ్ ఆయిల్ తీసుకుని మీ గోర్లు అందులో పది నిమిషాల పాటూ నానేలా చేతుల్ని ముంచి ఉంచండి. ఆ తరువాత.. ఎక్కువగా ఉన్న ఆయిల్‌ను శుభ్రంగా గుడ్డతో తుడిచేయండి. చేతులు కడుక్కున్న తరువాత.. అవి ఎండిపోకుండా. హ్యాండ్ క్రీం ను రాయండి. పొడిగా ఉండే గోర్లు విరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
గోర్లు మరింత పొడిగా ఉండకపోవడానికి గాను... అసిటోన్ ఫ్రీ అయిన నెయిల్ పాలిష్ రిమూవర్లను వాడండి. మిల్క్ క్రీం అప్లయి చేసిన తరువాత.. నెమ్మదిగా గోర్లను మసాజ్ చేయండి. గోర్ల కింద రక్తప్రసరణ బాగా ఉండేలా కూడా.. నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన గోర్లను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యం అవుతుందని చెబుతున్నారు.