: కిల్లి కృపారాణి వాహనాన్ని ఢీ కొట్టేందుకు యత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు


కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఈ రోజు పెను ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా రాజపులోవ వద్ద గుర్తు తెలియని వాహనం ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టేందుకు తీవ్రంగా యత్నించింది. మూడు సార్లు ఢీ కొట్టేందుకు ప్రయత్నించారని మంత్రి తెలిపారు. మొదటి సారి ఢీ కొట్టడానికి ప్రయత్నించిన వెంటనే అప్రమత్తమైన తాను పోలీసులకు సమాచారం అందించానని చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు హనుమంతువాట దగ్గర కారును పట్టుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎవరు? ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారు? అనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News