: కేజ్రీవాల్ కు హర్షవర్ధన్ అభినందనలు
ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి హర్షవర్ధన్ అభినందనలు తెలిపారు. అంచనాలకు మించి ఆ పార్టీ అధిక సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుందని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపించినందుకు ఆయన ఓటర్లకు కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే 15 సంవత్సరాలపాటు ఢిల్లీకి సేవలందించినందుకు షీలాదీక్షిత్ కు కుడా ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.