: నా సర్వే నిజమైంది: లగడపాటి
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తన సర్వే నిజమైందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ కు ఎదురుగాలి వీస్తోందని తాను చెప్పిన మాటలు నిజమయ్యాయని చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి మెజారిటీ వస్తుందని తాను చెప్పానని... ఇప్పుడదే జరిగిందని తెలిపారు. ఈవీఎంలో ఏఏపీ గుర్తైన చీపురు కింద బ్యాట్ గుర్తు ఉండటంతో, చాలా మంది తికమక పడ్డారని... లేకపోతే ఏఏపీకి మరిన్ని స్థానాలు దక్కేవని లగడపాటి చెప్పారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని అన్నారు.