: హైదరాబాద్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సంబరాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంచనాలకు మించిన స్థానాలను గెలుచుకోవడంతో, హైదరాబాద్ లోని ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయం వద్ద పార్టీ గుర్తైన చీపురును పట్టుకుని, నినాదాలు చేశారు. పార్టీని ప్రారంభించి ఏడాది కూడా కాకుండానే, దేశ రాజధానిలో ఏఏపీ తనదైన ముద్ర వేసిందని అభిమానులు తెలిపారు. ఇది సామాన్య ప్రజల విజయమని అన్నారు.